Thursday, May 2, 2024

Budget Special puja: దుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ పత్రాలు…ప్రత్యేక పూజలు…

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో):వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటన్ ఎకౌంటు బడ్జెట్ పత్రాలను కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిర్వహించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లోని శ్రీ అమ్మవారి ఆలయంకు అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024-2025 ఆర్ధిక సంవత్సర అంచనా బడ్జెట్ ను శ్రీఅమ్మవారి వద్ద సమర్పించారు.

పూజలు జరిపి అమ్మవారి ఆశీర్వాదాలను రాష్ట్ర ఆర్ధిక శాఖ బృందం – ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్,ఆర్థిక శాఖ కార్యదర్శి కే వి వి సత్యనారాయణ, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి బి సునీల్ కుమార్ రెడ్డి పొందారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనంను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ అధికారులు కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్ ఆర్ కోటేశ్వర రావు, సహాయ కార్యనిర్వాహనాధికారి ఎన్ రమేష్, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement