Friday, May 3, 2024

శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. రేపటి నుంచి ఆర్జిత సేవలు..

శ్రీశైలం, ప్రభ న్యూస్: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలో భాగంగా సాయంకాలం స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం నిర్వహించడం విశేషం. పుష్పోత్సవంలో 21 రకాల పుష్పాలతో విశేషంగా ఆర్జించారు.

నేటినుంచి ఆర్జితసేవలు పునఃప్రారంభం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో శనివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. గర్భాలయ అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు, వృద్ధమల్లికార్జునస్వామివార్ల అభిషేకం, గోపూజ, గణపతి హోమం, చండీహోమం, రుద్రహోమం, శ్రీవల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, విరామదర్శనం మొదలైనవన్నీ యథావిధిగా జరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement