Tuesday, April 30, 2024

Blessings – శత చండీయాగం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

అమరావతి – టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీయాగం చేస్తున్నారు. దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొదటి రోజు యాగాలు కొనసాగాయి. మూడు రోజులపాటు ప్రత్యేక హోమాలు, పూజలు చేయనున్నారు చంద్రబాబు దంపతులు. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు దంపతులు చేస్తున్న యాగానికి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి.. హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతకు, భయభీతి పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీ యాగం చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు. ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులు ఈ యజ్ఞయాగాలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement