Thursday, May 2, 2024

Krishna: దూసుకు వస్తున్న పెను తుఫాన్… కృష్ణాజిల్లాలో మొదలైన వర్షాలు,ఈదురు గాలులు

(ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా) బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను దూసుకు వస్తుంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ గంటకు 14 కి.మీ వేగంతో కదులుతుంది. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం వద్ద మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది.  సముద్రం కొన్ని ప్రాంతాల్లో ముందుకు వచ్చిందంటున్నారు. కృష్ణాజిల్లా తీర ప్రాంతంలోపది మీటర్ల ఎత్తున సముద్ర పు అలలు ఎగిసిపడుతున్నాయి. ,దివిసీమప్రాంతంయిన కోడూరు, నాగాయలంక మండలాల్లో ని సముద్రం తీరప్రాంతగ్రామాలో ఉంటగుణం, రామకృష్ణ పురం, పాలకాయతిప్ప, బసన్నపాలెం ,ఇరాలి, చింతకోళ్ళ ,ఎదురు మెండి, ఎల్లిచెట్లదిబ్బ ,సోర్లగోంది, నాలి ,సంగమేశ్వరం , కృత్తివెన్ను మండలం చినగోలపాలెం, మచిలీపట్నం మండలం పెదపట్నం, మంగినపూడి, పోలాటి తిప్ప, తదితర పలు గ్రామాల్లో ని ప్రజలు భయాందోళన తో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు అధికారుల సమాచారంతో మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. జిల్లాలో 7 మండలాల్లోని 51 గ్రామాల్లో 57 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. ఈ పునరావస కేంద్రాలకు 1,814 మందిని తరలించారు. మరో 7,763 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు మఖం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్యులను, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచారు. రైతులు గుండెల్లో అలజడి మొదలైంది వర్షం లేపద్యంలో చిన్న, సన్న కారు రైతులు పంటను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోతలు కోసి పనల మీద ఉన్న వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఈదురు గాలుల ప్రభావంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రోజువారి వ్యాపారస్తులు వర్షం ప్రభావంతో నష్టాన్ని చూడాల్సి వస్తుందని వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement