Friday, May 3, 2024

బాల‌య్య‌కు శ‌స్త్రచికిత్స‌.. హైద‌రాబాద్ కేర్‌లో ట్రీట్‌మెంట్‌

సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. బాలకృష్ణ కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు.

శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో గత నెల 31న కేర్ లో చేరారు బాల‌కృష్ణ‌. ఆయనకు కేర్ వైద్య నిపుణుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. 4 గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.

శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకోవడంతో నేడు డిశ్చార్జి అయ్యారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్ట‌ర్లు బాలయ్యకు సూచించారు. కాగా, బాలకృష్ణకు 2018లోనూ కుడిచేతికి రొటేటింగ్ కఫ్ సమస్య రావడంతో కాంటినెంటల్ హాస్పిట‌ల్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement