Sunday, April 28, 2024

AP – ఇదీ మహా దివ్య క్షేత్రం..! త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం…

పశ్చిమ ప్రకాశం ప్రతినిధి (ప్రభన్యూస్ ) – మహా పుణ్యక్షేత్రాల్లోనే … శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపురసుందరీ పుణ్యక్షేతం అద్భుతం. విభిన్నం. గొప్ప దివ్వ క్షేత్రం. రాక్షస గణం నిర్మించిన దేవాలయంగా జన బాహూళ్యం. ఇక్కడ శ్రీ శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, . చిదగ్నిగుండ దర్శిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కొలువుదీరారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేంద్రానికి సమీపంలోని ఈ మహా పుణ్యక్షేత్రంలో వారం రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇప్పటికే ఆయల నిర్వాహకులు సకల ఏర్పాట్లల్లో మునిగి తేలుతున్నారు. బుధవారం నుంచి ఈ మహోత్సవాలు జరుగుతాయి.

రాక్షస గణాలయం…

ఇది శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి తూర్పు ముఖ ద్వారం. ఈ క్షేత్రంలోనే త్రిపురాసుర సంహారం జరిగిందని పండితారాధ్య చరిత్ర చెబుతోంది. చక్రాకారంలో ఈ శివాలయం క్షేత్ర ప్రత్యేకత. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ధనుమాడిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి త్రిపుర హంతకంగా పిలిచారు. కాలక్రమేనా త్రిపురాంతకం మారిందిభక్తులు చెబుతుంటారు. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకుంటే పాపాలన్ని తొలగుతాయని భక్తులు నమ్మకం. ప్రపం చంలో ఏ శివాలయానికి వెళ్లి పూజలు చేసేటప్పుడు జపించే మంత్రంలో త్రిపురాంతకేశ్వయని పేరును మంత్రంలో ఉచ్చరించాలి. ఈ క్షేత్రానికి అంతటి గొప్ప ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రంలో నైరుతి ద్వారంలో ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారు. దీనితో రాక్షస లక్షణాలు అలవాడతాయని, అవి తొలగిపోయేందుకు అమృతంతో సమాన తేనెతో స్వామిని పూజించి భక్తులకు తీర్థం ఇస్తుంటారు. ఒకప్పుడు శ్రీశైలం మహా క్షేత్రాన్ని కాలినడకన సందర్శించే భక్తుల్లో ఉత్తరభారతం, ఆంధ్రప్రదేశ్ లోని సర్కార ప్రాంతాల భక్తులు ఈ త్రిపురాంతక క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్లేవారు.

రేపటి నుంచి మహాశివరాత్రోత్సవాలు :

మార్చి 6 నుంచి 12 వరకూ ఉభయ దేవాలయాలలో మహా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ స్వామికి విశేష పూజలు, అమ్మవారికి విశేష అర్చనలు, రుద్ర హోమం జరుగుతున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం, కళ్యాణ మహోత్సవం, 10న సాయంత్రం 3.00 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఐ.వి.సుబ్బారావు, కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement