Monday, April 29, 2024

AP – వైసిపి విముక్త్ కోసమే జ‌న‌సేన – టిడిపి క‌ల‌యిక – చంద్ర‌బాబు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ) – రాష్ట్ర‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వంపై భయం ఉన్నాయని వీరందని వైసీపీ నుంచి విముక్తి చేయటానికి.. రాష్ట్రాన్ని కాపాడేందుకు.. ప్రజల కోసం, ప్రజల మధ్యన ఉండే సమర్థ నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి విడుదల చేశారు. అంతక ముందు జనసేన, టీడీపీ మధ్య ఎన్నికల పొత్తుపై చర్చలు జరిగాయి.

జ‌న‌సేన‌కు 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాలు..

24 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ సీట్లల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ అంగీకరించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో 94 అసెంబ్లీ సీట్లల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ ఉమ్మడి ఒప్పందం ఏపీ చరిత్రలోనే ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. రాష్ట విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని చక్కదిద్ది అభివృద్ధి చేసే క్రమంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో తీవ్ర విఘాతం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోలుకోలేని స్థితికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..

రాష్టం కోలుకోలేని స్థితికి దిగజారిందని, జరిగిన నష్టం ఒక వ్యక్తిది కాదని, అయిదు కోట్ల మంది ప్రజలకు నష్టం క‌లిగింద‌న్నారు చంద్ర‌బాబు. అయిదేళ్ల పాలనలో బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ని డెమాలిష్ చేశారని, అహంకారంతో ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం అయిదేళ్లపాటు కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పు అని ప్రశ్నించలేని స్థితిలో పవన్ కళ్యాన్‌పై నిర్బంధం పెంచారని, ఇప్పటం గ్రామంలో ఆందోళన నుంచి విశాఖలో రోడ్ షో వరకూ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థితిలో ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కలిగించేందుకు తమ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని వివరించారు.

- Advertisement -

అభ్య‌ర్థుల విష‌యంలోనూ చాలా క్లియ‌ర్‌గా ఉన్నాం..

అభ్యర్థుల ఎంపికలోనూ రాజకీయంగా తీవ్ర ఎక్సైర్ సైజ్ చేశామని, 9 ఎన్నికల అనుభవం ఉన్న తాను మంచి అభ్యర్థులను ఎంపిక చేయటంలో క్షుణ్ణంగా పరిశీలించామని చంద్రబాబు చెప్పారు. కోటి పది లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని, ప్రజలు, కార్యకర్తల మనోస్థితిని నమ్మి , సరైన సమాచారంతో అన్ని కోణాలు విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేశామని, టీడీపీ నుంచి 118 స్థానాల్లోనూ , జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో 23 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారని, యువత, మహిళలు, బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే అభ్యర్థులనే ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు. ఇక ఎర్రచందనం స్మగ్లర్లను, రౌడీలను రంగంలోకి దించటమే కాదు, రాష్టం నలుమూలకు తరలించారని, అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రంలో భయం నెలకొందని చంద్రబాబు స్పష్టం చేశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement