Wednesday, May 1, 2024

AP – జిల్లాల వారిగా తెలుగుదేశం అభ్య‌ర్ధుల జాబితా ఇదే..

తాడేప‌ల్లి – టిడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో టిడిపి త‌న ఫస్ట్ లిస్ట్‌లో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ-జనసేన పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన కలయిక అని తెలిపారు. ఇప్పటం సభలో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. తొలి జాబితాలోని 118 స్థానాల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా, చంద్రబాబు కుప్పం నుంచి, నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి, బాల‌కృష్ణ హిందూపురం నుంచి మరోసారి పోటీ చేయనున్నారు.

శ్రీకాకుళం ….

ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
టెక్కలి-అచ్చెన్నాయుడు
ఆమదాలవలస-కూన రవికుమార్‌
రాజాం-కోండ్రు మురళి

విజ‌య‌న‌గ‌రం….

- Advertisement -

కురుపాం – తొయ్యక జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్‌ బోనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు (బేబి నాయన)
గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం – అదితి గజపతిరాజు

విశాఖ‌ప‌ట్నం

అరకు – సియ్యారి దొన్ను దొర
అనకాపల్లి – పీలా గోవింద్
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణ బాబు
పాయకారావు పేట – వంగలపూడి అనిత

తూర్పు గోదావ‌రి …

తుని-యనమల దివ్య
పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి.గన్నవరం – రాజేశ్‌ కుమార్‌
కొత్తపేట – బండారు సత్యానంద రావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
రాజానగరం – బత్తుల రామకృష్ణారెడ్డి

ప‌శ్చిమ గోదావ‌రి ..

ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
చింతలపూడి – సోంగ రోషన్‌

కృష్ణా జిల్లా ….

తిరువూరు – కొలికపూడి శ్రీనివాస్‌
నూజివీడు – కొలుసు పార్థసారథి
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్‌
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – వర్ల కుమార రాజ
విజయవాడ సెంట్రల్‌ – బోండ ఉమ
విజయవాడ ఈస్ట్‌ – గద్దె రామ్మోహన రావు
నందిగామ – తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య

గుంటూరు …

తాడికొండ – తెనాలి శ్రవణ్‌ కుమార్‌
మంగళగిరి – నారా లోకేశ్‌
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు(ఎస్సీ) – నక్కా ఆనంద్‌బాబు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌
బాపట్ల – వి.నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు(ఎస్సీ) – బూర్ల రామాంజినేయులు
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మినారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ప్ర‌కాశం జిల్లా ..
యర్రగొండపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్సన్‌ బాబు
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్‌
సంతనూతలపాడు (ఎస్సీ) – బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
ఒంగోలు – దామచర్ల జనార్దనరావు
కొండపి – డోలా బాల వీరాంజనేయస్వామి
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

నెల్లూరు జిల్లా ..
కావలి – కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ – పి. నారాయణ
నెల్లూరు రూరల్‌ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
గూడూరు (ఎస్సీ) – పాశం సునీల్‌కుమార్‌
సూళ్లూరుపేట (ఎస్సీ) – నెలవేల విజయశ్రీ
ఉదయగిరి – కాకర్ల సురేశ్‌

క‌డ‌ప జిల్లా..
కడప – మాధవిరెడ్డి
రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్‌ యాదవ్‌

క‌ర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు – టీజీ భరత్‌
పాణ్యం – గౌరు చరితా రెడ్డి
నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్‌
బనగానపల్లి – బీసీ జనార్దనరెడ్డి
డోన్‌ – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాంబాబు
కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం – కాలవ శ్రీనివాసులు
ఉరవకొండ – పయ్యావుల కేశవ్‌

అనంత‌పురం జిల్లా …

తాడిపత్రి – జేసీ అస్మిత్‌ రెడ్డి
శింగనమల (ఎస్సీ) – బండారు శ్రావణి శ్రీ
కల్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు – పరిటాల సునీత
మడకశిర (ఎస్సీ) – ఎం.ఈ. సునీల్‌కుమార్‌
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
పెనుకొండ – సవిత

చిత్తూరు జిల్లా
తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
నగరి – గాలి భానుప్రకాశ్‌
గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డాక్టర్‌ వీఎం. థామస్‌
చిత్తూరు – గురజాల జగన్‌ మోహన్‌
పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement