Monday, May 20, 2024

AP | ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల..

ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఓపెన్ స్కూల్స్ సొసైటీ హాల్ టికెట్లను https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకూ పరీక్షలు జరుగనుండ‌గా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ నిర్వహించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

పదో తరగతి టైమ్ టేబుల్

మార్చి 18 – తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం
మార్చి 19-హిందీ
మార్చి 20-ఇంగ్లిష్
మార్చి 22-గణితం, భారతీయ సంస్కృతి వారసత్వం
మార్చి 23-శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం
మార్చి 26- సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం

ఇంటర్ పరీక్షల షెడ్యూల్

మార్చి 18 – హిందీ, తెలుగు , ఉర్దూ
మార్చి 19- జీవ శాస్త్రం, వాణిజ్య/వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం
మార్చి 20- ఇంగ్లిష్
మార్చి 22-గణితం
మార్చి 23- భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం/ పౌరశాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం
మార్చి 26- రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement