Sunday, April 28, 2024

AP – చెవిరెడ్డి స్వ‌గ్రామంలో హై టెన్ష‌న్ …

హాథీరాంజీ భూముల‌లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు..
జెసిబిల‌ను అడ్డుకున్న స్థానికులు..
టిడిపి నేత‌ల రంగ ప్ర‌వేశం..
వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భూముల‌ను కొట్టేసేందుకే చెవిరెడ్డి కుట్ర‌..
ఎమ్మెల్యేపై నిర్వాశితులు మండిపాటు

తిరుపతి : వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామం తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు, పోలీసులు మోహరించారు. అనంతరం ఆక్రమణలు తొలగించే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

తెలుగుదేశం నేత‌లు గృహ నిర్భంధం..

టిడిపి నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గ్రామస్థులకు మద్దతుగా వెళ్లారు. ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట్లోనే నిర్బంధించారు. పులివర్తి నానిని కూడా గృహ నిర్బంధం చేశారు. కాగా, ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న మహిళకు గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.

భూముల స్వాధీనానికే చెవిరెడ్డి కుట్ర‌..

- Advertisement -

మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ స్థలాలు కొనుగోలు చేశామని.. అధికారులు వచ్చి వాటిని తొలగించడం తగదన్నారు. ఎమ్మెల్యే బంధువులు భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎవరూ అడ్డుచెప్పడం లేదని.. పేదల షెడ్లను మాత్రం తొలగిస్తున్నారని మండిపడ్డారు. 22 ఎకరాలను చెవిరెడ్డి తన అధీనంలో ఉంచుకున్నారని.. మఠం అధికారులు వాటిని వెంటనే స్వాధీన పరచుకోవాలని డిమాండ్‌ చేశారు.

చెవిరెడ్డి కాదు అత‌డు క‌బ్జారెడ్డి…

ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైసిపి నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టిడిపి నేతలను గృహ నిర్బంధం చేసి అర్ధరాత్రి వెళ్లి జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేస్తారా? అని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భూకబ్జా రెడ్డిగా మారిపోయారని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement