Thursday, May 2, 2024

AP: సోమ‌శిల‌కు భారీగా వ‌ర‌ద‌.. మూడు గేట్లు ఎత్తి దిగువ‌కు నీరు విడుద‌ల చేస్తున్న అధికారులు

Nellore: నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు జ‌లాశ‌యం నుండి (5, 6, 7) మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీరు పెన్నాకు విడుదల చేస్తున్నారు. రెండు, మూడు రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు జలాశయానికి 19 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73 టీఎంసీల నీరు నిల్వ ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement