Saturday, May 4, 2024

అనంతపురం రోడ్డు ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లా పామిడి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందిన ఘటన పై ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించవలసినదిగా జిల్లా అధికారులను గవర్నర్ ఆదేశించారు.

కాగా, అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అందులో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం అంతులేని వేగంతో వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఆటో నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: నెల్లూరులో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

Advertisement

తాజా వార్తలు

Advertisement