Thursday, April 25, 2024

కేదార్‌నాథ్‌లో మోడీ ప్ర‌త్యేక పూజ‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్నారు. చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదార్‌నాథ్‌లో ఆయ‌న‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌కి చేరుకుని అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. అనంతరం పర్వత శ్రేణుల్లో నడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆల‌యంలో ప్రార్థన‌లు నిర్వహించిన త‌ర్వాత, ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.
కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ తర్వాత మళ్లీ పునర్‌నిర్మించారు.. 2013 వరదల తర్వాత కేదార్‌నాథ్‌లో జరిగిన అభివృద్ధి పనులను ప్రధాని పరిశీలించారు. సరస్వతి రిటైనింగ్ వాల్ ఆస్థపథం, ఘాట్‌లు, మందాకిని రిటైనింగ్ వాల్ ఆస్థపథం, తీర్థ పురోహిత్ హౌస్‌లు, మందాకిని నదిపై గరుడ్ చట్టి వంతెనతో సహా రూ.130 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని 8క్వింటాళ్ల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలను మోహరించి పకడ్బంధీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement