Sunday, May 5, 2024

క్యాసినో ఆడిస్తున్నా..ఒప్పుకున్న గుత్తా సుమ‌న్..

హీరో నాగ‌శౌర్య ఫామ్‌హౌస్ పేకాట కేసులో కొత్త కథలు బయటికి వస్తున్నాయి. క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కళావర్ కింగ్‌ నోటి నుంచి క్యాసినో కథ మొత్తం కక్కిస్తున్నారు పోలీసులు. ఎవరెవరితో లింకులున్నాయి. ఏమేం కేసులు ఉన్నాయి. ఫారిన్ క్యాసినోలకు వెళ్లిన ప్రముఖులెవరంటూ ప్రశ్నలతో సుమన్‌ను పేకాటాడేసుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ప్ర‌తిరోజు 600మందికి క్యాసినో మెసేజ్ లు చేసేవాడ‌ని తేలింది. ఇప్ప‌టికే సుమ‌న్ కుమార్ పై ఐదుగురు ఫిర్యాదు చేశారు. గుత్తా సుమ‌న్ బ‌ర్త్ డే పార్టీకోసం ఫాంహౌస్ ల‌ను రెంట్ కి తీసుకునేవాడ‌ట‌. గోవా,శ్రీలంక‌,ర‌ష్యా, ఫ్రాన్స్ లో క్యాసినో ఆడిస్తున్నాన‌ని సుమ‌న్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చిన వారినే తీసుకువెళ్తాన‌ని వెల్ల‌డించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement