Saturday, December 7, 2024

AP – హౌ ఈస్​ ఇట్​ కాఫీ.. చంద్ర‌బాబుకు భువనేశ్వరీ ట్విట్ …

అర‌కు – నిజం గెలవాలి యాత్రలో భాగంగా అరకులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా అరకు కాఫీ రుచి చూశారు. కాఫీ రుచి ఎలా ఉందంటూ ఎక్స్ వేదికగా భువనేశ్వరిని చంద్రబాబు అడిగారు. ‘మన గిరిజన సోదరులు పండించే అరకు రుచి ఎలా ఉందో చెప్పమంటూ’ భువనేశ్వరికి చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో భువనేశ్వరి అరకు కాఫీని రుచి చూశారు. అరకు సెంటర్‌లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగారు.

స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించారు. చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని దొన్నుదొర ఆమెకు వివరించారు. అరకు ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను కూడా భువనేశ్వరి పరిశీలించారు. అరకును పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో అరకు ప్రాంతాన్ని, కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని భువనేశ్వరి స్థానికులకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement