Saturday, December 7, 2024

Movies : ఈవారం థియేటర్లలో….

ఈవారం థియేటర్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పేరుకు పెద్ద సినిమా ఒక్కటే అయినా ఆసక్తికర సినిమాలు కూడా బరిలో ఉండడం విశేషం ఈ శుక్ర‌వారం మొత్తం ఆరు మూవీలు విడుద‌ల‌వుతున్నాయి.

ఆపరేషన్ వాలెంటైన్
వరుణ్ తేజ్ హీరోగా మనుషి చిల్లర్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. పుల్వామా ఎటాక్స్ తర్వాత జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి రినైసన్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

భూతద్దం భాస్కర్ నారాయణ
రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా తెరకెక్కించారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ కావడంతో టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ క్యాస్ట్ లేకపోయినా కంటెంట్ బావుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

- Advertisement -

చారి 111
వెన్నెల కిషోర్ హీరోగా సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా ఈ చారి 111 అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ఒక స్పై మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి.

వ్యూహం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా వ్యూహం. ఏపీ ప్రతిపక్ష పార్టీ నుంచి నమోదైన కేసుల నేపథ్యంలో అనేక వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాను మార్చి ఒకటో తేదీన రిలీజ్ చేసేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2వ తేదీన‌ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఆర్‌జీవి ప్ర‌క‌టించారు.

ఇంటి నెంబర్ 13
ఇంటి నెంబర్ 13 అనే ఒక హారర్ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని అధికారిక ప్రకటన ఉంది. ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి, అమృతం అప్పాజీ, 30 ఇయర్స్ పృథ్వి, నెల్లూరు సుదర్శన్ వంటి వాళ్ళు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. పన్నారాయల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

రాధా మాధవం
వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొత్త నటినటులతో వస్తున్న ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌నే అంచ‌నాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement