Sunday, May 19, 2024

AP: భీమిలి తాటితూరులో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచార యత్నం

పోలీసులకు బాధితుల ఫిర్యాదు
నిందితుడి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

విశాఖ క్రైం : ఎనిమిదేళ్ల బాలిక‌పై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న భీమిలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితునిపై పోలీసులు ఫోక్సో చట్టంగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిన్న (మంగ‌ళ‌వారం) శీల అప్పలకొండ తన మనవరాలు (8)తో కలిసి ఆవును మేపడానికి వెళ్లింది. అదే స‌మ‌యంలో చిన్నారి ఆడుకోవడానికి సమీపంలోని రాజు గారి ఇంటికి వెళ్లింది. తర్వాత ఆవును కట్టి తిరిగి వచ్చేసరికి మనవరాలు ఏడుస్తూ రావడం కనిపించింది.

ఏమైంద‌ని అడ‌గ్గా ఒక వ్య‌క్తి తీసుకెళ్లి త‌న పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. వెంటనే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రాజుగారి ఇంటికి వెళ్లి విచారించగా.. సరగడ సన్యాసి రావు అనే వ్యక్తి చిన్నారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెల‌సింది. బాలిక కుటుంబ స‌భ్యులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement