Wednesday, May 1, 2024

ఏపీ ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రుణం.. సెక్యూరిటీల వేలంతో అప్పు స‌మీక‌ర‌ణ‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి… ఈ అప్పు సమీకరించింది. 16 ఏళ్లకు 7.74శాతం వడ్డీతో 500 కోట్ల, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లు అప్పు తెచ్చింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై వరకూ రాష్ట్ర ప్రభుత్వం 21 వేల 500 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. 105రోజుల్లోనే రూ.31 వేల కోట్ల అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్‌ సృష్టించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2022-23 ఆర్థిక ఏడాదికి ఏపీకి రూ.48 వేల కోట్ల రుణానికి అనుమతి ఉండగా.. నేటికే రూ.31 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది జగన్‌ సర్కార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement