Thursday, May 2, 2024

ఏపీకి మరో గండం.. అల్పపీడనంగా మారిన వాయుగుండం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

అల్పపీడనం దిశ మార్చుకుంది. దక్షిణ కోస్తా, తమిళ నాడు తీరం వైపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కోన్నా..ప్రస్తుతం ఈ అల్ప పీడనం దక్షిణ థాయిలాండ్‌, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఏర్పడినది. దీనికి అనుభందంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్‌ వరకు విస్తరించి ఉం ది. ఇది బుధవారం నాటికి అండమాన్‌ సముద్ర సమీపానికి వచ్చే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి బలపడి డిసెంబర్‌ 2వ తేదీకల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

ఇది మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్‌ 3వ తేదీకల్లా బలపడి తుపాన్‌గా మారుతుందని తెలిపారు. .ఇది తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరమునకు 4వ తేదీకల్లా చేరవచ్చని, ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, పరిసర జిల్లాల్లో, ఒడిశా సమీపంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయ లసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చొట్ల కురిసే అవకాశ ముంది .

తుపాను బలహీన పడితే ఉత్తర తమిళనాడు లేదా దక్షిణ ఆంధ్ర నెల్లూరు ప్రకాశం జిల్లాలను తాకుతుంది. దీని వల్ల భారీ వర్షాలు రాయల సీమ దాక విస్తరిస్తాయంటున్నారు. బలపడితే మాత్రం వానలతో పాటు- గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటు-ంది. దీని వల్ల కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకు ళం వరకు ఎక్కువ ప్రభావం ఉంటు-ంది. నెల్లూరు, దక్షిణ ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement