Thursday, May 2, 2024

అన్నా ఎలా ఉన్నావ్, హెల్త్ ఎట్లుంది – సీపీఐ నారాయణ ఆరోగ్యంపై తిరుప‌తి ఎంపీ ఆరా..

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట పరిశీలనకు వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కాలికి గాయం అయ్యింది. ఆ సందర్భంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రథమ చికిత్స అందించారు.

ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం పొందిన నారాయణ 40 రోజుల పాటు కాలికి కట్టిన కట్టు తొలగించి నడుస్తున్న సందర్భంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆదివారం సీపీఐ ఆఫీసుకు వెళ్లి ఆయ‌న ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలో తెలుపుతూ.. ఆయ‌న కాళ్ల‌కు తిరుప‌తి ఎంపీ గురుమూర్తి ఫిజియోథెరపీ చేశారు. ఫిజియోథెరపీ ద్వారానే బాగ‌వుతుంద‌ని. త్వ‌ర‌గా న‌డ‌వ‌గ‌లుగుతార‌ని ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement