Monday, April 29, 2024

Breaking: కరోనా నియంత్రణ చర్యలపై హైలెవల్ కమిటీతో ప్రధాని మోడీ సమీక్ష

దేశంలో మహమ్మారి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే గత డిసెంబర్ 24న ప్రధాని మోడీ కరోనాపై సమీక్ష నిర్వహించగా.. అప్పటి నుండి దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసులు భారీ పెరుగుదలతో మహమ్మారి పరిస్థితి మారిపోయింది. Omicron అనేక నగరాల్లో టాప్ వేరియంట్ గా రికార్డులు కొడుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ ఈ సందర్భంగా సూచించారు.

టీకా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాని మోడీ. అంతేకాకుండా 15 , 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలన్నారు. జనవరి 10 నుండి ఫ్రంట్‌లైన్ కార్మికులు, సీనియర్ సిటిజన్‌లకు బూస్టర్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశంలో కొవిడ్ కేసులు కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం దేశంలో 1.6 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేస్ లోడ్ దాదాపు 6 లక్షలకు చేరుకుంది. దీంతో అనేక రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ పెడుతూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.  ఈ క్రమంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పలు రాష్ట్రాలను భయాందోళనకు గురిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement