Monday, April 29, 2024

Andhra Pradesh – ఇక‌పై మ‌రింత సంక్షేమం – ఆగిన పించ‌న్లు మ‌ళ్లీ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సంక్షేమ పాలనను అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాబోయే రోజుల్లో ఆ సంక్షేమాన్ని మరింతగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గతంలో వివిధ పథకాల లబ్దిదారులుగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలతో మధ్యలో ఆ పథకాలు నిలిచిపోయిన వారికి అర్హతను పున:పరిశీలన చేయాలని నిర్ణయంతీసుకున్నారు. తిరిగి వారికి పథకాలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులకు మేలు జరిగేలా పథకాల లబ్దిదారుల విషయంలో మరో కీలక అడుగులు పడినట్లయింది. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద గతంలో ఫించను అందుతూ వివిధ కారణాలతో నిలిపివేసిన వాటిని పునపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తనిఖీలో అర్హులుగా తేలితే తిరిగి వారికి ఫించను అందించనున్నారు. ఈ మేరకు గతంలో ఫించను అందుతూ నిలిపివేసిన వారి వివరాలు గ్రామ, వార్డు సచివాయల్లోని సంక్షేమ కార్యదర్శులకు అందించాలని వాలంటీ-ర్లను ప్రభుత్వం ఆదేశించింది.

అర్హత ఉంటే ద్వైవార్షిక చెల్లింపుల్లో కొత్తగా మంజూరు చేయనున్నట్లు- జిల్లాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఎన్నికలకు వెళ్లే ముందు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందాలనేది సీఎం జగన్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా 61,21,698 మందికి రూ.1,47,835 పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఈ సంఖ్య సుమారు 63 లక్షలకు పెరిగినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇకపై వీరి సంఖ్య భారీగానే పెరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు మరో 5 లక్షల వరకూ ఈ పింఛన్లు పెరిగే అవకాశముందని సమాచారం. ఇక నేతనన్న నేస్తం కింద 75,243 మందికి ఇప్పటికే పింఛన్లు అందుతుండగా తాజాగా ఈఏడాది అదనంగా కొత్తగా మరో 21,963 ఇవ్వడంతో అవి 97,206కు చేరాయి. ఇదే తరహాలో వివిధ రకాల పింఛన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పింఛన్లు పునరుద్దరణకు వడపోత
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ గడపకు అధికార యంత్రాంగాన్ని పంపింది. ప్రతీ ఇంటిని వడపోసింది. తాజాగా జగనన్న సురక్ష ద్వారా ఇటు-వంటి వారిని గుర్తించింది. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు- రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటు-ంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మందికి ఇప్పటికే వైఎస్సార్‌ ఫించను కానుక కింది ప్రతీ నెలా 1వ తేదీ ఉదయమే రూ 2,750 అందిస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఆ మొత్తాన్ని రూ 3000కి పెంచాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. వీరితో పాటు-గా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు రూ 10 వేల చొప్పున పెన్షన్‌ అందిస్తున్నారు.

ఎన్నికల వేళ కీలక నిర్ణయం
వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్‌ ప్రతీ సభలో కోరుతున్నారు. రాష్ట్రంలో 89 శాతం మందికి పథకాలు అందుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పథకాల లబ్దిదారుల సంఖ్య భారీగా పెరగనుంది. దీని ద్వారా లబ్దిదారులకు మేలు జరగటంతో పాటు-గా.. జగన్‌ ఓట్‌ బ్యాంక్‌ మరింత సుస్థిరం కానుంది. రెండో విడత జగనన్న సురక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతీ ఇంటికి లబ్ది చేయాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. టీ-డీపీ సంక్షేమంతో మేనిఫెస్టో ప్రకటించినా…ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన కనిపించలేదనే అభిప్రాయం ఉంది. దీంతో, ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా తీసుకున్న నిర్ణయాలు పాలనా పరంగా..రాజకీయంగా కీలకంగా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement