Monday, May 6, 2024

హిందూపురం మున్సి’పోల్’ కౌంటింగ్ కు కౌంట్ డౌన్…

గట్టి భద్రత మద్య కౌంటింగ్ హాల్
రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.
12 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం.
కౌంటింగ్ ఏర్పాట్లను పరసీలించిన కలెక్టర్.
హిందూపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభం అవుతుంది. ఈ నెల 10 న‌ జరిగిన పోలింగ్ నాలుగు రోజుల విరామం తరువాత ఆదివారం కౌంటింగ్ అధికారులు చేపట్ట‌నున్నారు. పట్టణ పరిదిలొని యం జీ యం పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేసారు. మొత్తం 38 వార్డులకు 8 రౌండ్లు కేటాయించారు. ఒక్కొ రౌండులో 4 వార్డుల అభ్యర్థుల ఒట్ల లెక్కింపు జరుగుతుంది, చివరి రెండు రౌండ్లు 6 వార్డుల లెక్కింపుతో ప్రక్రియ ముగుస్తుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 38 వార్డులలొ ప్రధాన పార్టీలు వై సీ పీ, టీ డీ పి తో పాటు బీజీపీ, యం ఐ యం, జనసేన పార్టీల తో పాటు ఇండిపెండెంట్లు కలిపి 159 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. 1,20,764 మంది ఓటర్లు వుండగా కేవలం 77,975 మంది మాత్రమే పోలింగులో పాల్గొన్నారు. 52,789 మంది తమ ఓటు హక్కును వినియోగించు కోలేదు. తక్కువ శాతం ఓటు పొలుకావడం తో అభ్యర్థుల్లో గెలుపుపై అంచనాలు తారుమారు అవుతాయని గుబులు పుట్టుకుంది. ఇది ఇలావుండగా కౌంటింగ్ సెంటరును కలెక్టరు గంధం చంద్రుడు శనివారం పరసీలించారు. కౌంటింగ్ పారదర్శ కంగా జరగాలని అందుకు ఘటీచర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఒక్కొ అభ్యర్థికి ఒక్క ఏజెంటును మాత్రమే అనుమతించాలని, పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చేంత వరకు ఎవ్వరిని బయటకు పంపకూడదని కలెక్టరు తెలిపారు. ఉదయం 7గంటలకు అభ్యర్థులతో పాటు కౌంటింగ్ హాలులోకి అనుమటిస్టారని, సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాబోరని రిటర్నింగ్ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ యాక్ట్ 30 తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు పోలింగ్ నిబంధనలను అందరూ పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement