Wednesday, May 1, 2024

Anakonda – హౌసింగ్‌ కార్పొరేషన్‌ లో అవినీతి అనకొండ .. ఎసిబికి చిక్కిన డీఈఈ ఆంజనేయులు

ఒంగోలు – ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గుంటూరులో ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డీఈఈగా పని చేస్తున్న చెంచు ఆంజనేయులు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు

ఏకకాలంలో గుంటూరు, ఒంగోలు, బాపట్ల జిల్లా మేదరమెట్ల, వేటపాలెం మండలం కొత్తపేట, కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులో ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఈ సోదాల వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఒంగోలులో జీ ప్లస్‌ త్రీ హౌసింగ్‌ కాంప్లెక్స్, ఒక ప్లాటు, కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాలలో ఒక జీ ప్లస్‌ వన్‌ భవనం, రెండు స్థలాలు, కడవకుదురు వద్ద 1.9 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.53 లక్షల సేల్‌డీడ్‌ పత్రాలు లభించినట్లు తెలిపారు. కిలో బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధరల మేరకు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement