Monday, May 6, 2024

Miracle – పురుషుడికి గర్భం – షాక్ లో వైద్య రంగం

నాగపూర్ – మహిళలు గర్భవతి అవడం ప్రకృతి ధర్మం.. మరి పురుషులు గర్భం దాల్చడం.. వినేందుకే విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అది జరగని పని కాబట్టి. కానీ, ఇక్కడ అదే జరిగింది. ఓ వ్యక్తికి గర్భం వచ్చింది. అయితే, ఆ గర్భాన్ని గుర్తించడానికి 36 ఏళ్లు పట్టింది.

వివరాలలోకి వెళితే ఈ అరుదైన ఘటన 1999 నాటిది . నాగపూర్‌కు చెందిన సంజూ అనే వ్యక్తికి పొట్ట పెరుగుతూ వచ్చింది. 36 ఏళ్లుగా తన పొట్టు పెరుగుతోందని, దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతన్ని పరీక్షించి, స్కానింగ్ చేయించారు. కడుపులో గడ్డ ఉందని, దానిని క్యాన్సర్ గడ్డ అని భావించారు వైద్యులు. ఈ మేరకు సర్జరీకి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, సర్జరీ సమయంలో కనిపించిన గడ్డను చూసి విస్తుపోయారు వైద్యులు. ఎందుకంటే.. అది క్యాన్సర్ గడ్డ కాదు. క్రమంగా పెరుగుతూ వస్తున్న గర్భం. ఆ గర్భాన్ని చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. అయితే, ఈ పిండం అతని కవల సోదరుడిది అని, ఆయనలో ఉండిపోయిందని వైద్యులు వివరణ ఇచ్చారు. అలా 36 ఏళ్ల పాటు సంజూ కడుపులోనూ పిండం పెరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. దీనిని అత్యంత అరుదైన పీటస్ ఇన్ ఫీటుగా వైద్యులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement