Friday, April 26, 2024

Lands Scandle: అమ‌రావ‌తి అసైన్డ్ భూముల కుంభ‌కోణం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని అసైన్డ్ భూముల‌కు సంబంధించిన కుంభ‌కోణంపై సీఐడీ అధికారుల ద‌ర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఓ కీల‌క అడుగు వేశారు. కుంభ‌కోణంతో సంబంధం ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌, చిక్కాల విజ‌య‌సార‌థి, బ‌డే ఆంజ‌నేయులు, కొట్టి దొర‌బాబు ఉన్నారు. ఈ భూ కుంభ‌కోణంలో 1,100 ఎక‌రాల అసైన్డ్ భూములు చేతులు మారిన‌ట్లు సీఐడీ ఆరోపిస్తోంది.

ఇందులో 169.27 ఎక‌రాల విక్ర‌యాల‌కు సంబంధించి ఈ ఐదుగురు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు సీఐడీ తెలిపింది. మాజీ మంత్రి నారాయ‌ణ‌తో పాటు ఆయ‌న స‌మీప బంధువుల ఆధ్వ‌ర్యంలో ఈ భూముల విక్ర‌యాలు జ‌రిగాయ‌ని, ఈ విక్ర‌యాల్లో ఈ ఐదుగురు నిందితులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని సీఐడీ ఆరోపించింది. ఇందుకు గాను వీరికి రామ‌కృష్ణ హౌసింగ్ డైరెక్ట‌ర్ ఖాతాల నుంచి రూ.15 కోట్లు అందిన‌ట్లు ఆధారాలు ల‌భించాయ‌ని సీఐడీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement