Tuesday, May 7, 2024

ఎంఐజీ ప్లాట్లకు అగ్రిమెంట్ల ప్రక్రియ..

అమరావతి, ఆంధ్రప్రభ: మధ్య తరగతి ఆదాయ వర్గాలకు తోడ్పాటు-నందించే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) ఆధ్వర్యంలో తాడేపల్లి – మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నవులూరులో ఏర్పాట యిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌(ఎంఐజి) లే అవుట్లో ప్లాట్లు పొందిన 119 మంది లబ్ధిదారులకు అగ్రిమెంట్ల ప్రక్రియను ప్రారంభించారు.

బుధవారం విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్రిమెంట్ల ప్రక్రియకు లబ్ధిదారులు హాజరయ్యారు. సీఆర్డీఏ అధికారులు అగ్రిమెంట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు సీఆర్డీఏ కార్యాయంలో అగ్రిమెంట్ల ప్రక్రియ నిర్వహిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. సీఆర్డీఏ తహసీల్దార్‌ నాగలక్ష్మి, ప్రాజెక్టు సమన్వయకర్త పి.అజయ్‌ లబ్దిదారులకు అగ్రిమెంటు- పత్రాలు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement