Wednesday, May 15, 2024

దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన : సీఎం జగన్

తాడేపల్లి: వచ్చే దసరా పండుగ నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్.

ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతామన్నరు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి.. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు. రిటైర్డ్‌ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్‌ అయ్యేలా చూడాలన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది, UPSC లో ప్రిలిమ్స్, mains ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లుల పై చర్చించారు. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు పై చర్చ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement