Friday, May 3, 2024

ఎప్‌ సెట్‌ తొలిరోజు 93.54 శాతం హాజరు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎప్‌ సెట్‌- 2022 సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఇంజనీరింగ్‌, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాల కోసం పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 93.54 శాతం మంది హాజరైనట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. ఉదయం సెషన్‌కు 21 వేల 77 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 19 వేల 580 మంది(92.90 శాతం), మధ్యాహ్నం సెషన్‌కు 20 వేల 530 మందికి 19 వేల 338 మంది(94.19 శాతం) హాజరైనట్లు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement