Friday, April 26, 2024

ఎన్నికల ఇన్‌చార్జిలను నియమించిన బీజేపీ

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిలను నియమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉత్తరప్రదేశ్‌, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉత్తరాఖండ్‌కు, పంజాబ్‌కు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను, కేంద్రమంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరీ, మీనాక్షి లేఖిని కో ఇన్‌చార్జిలుగా నియమించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర సింగ్‌ ఫడ్నవీస్‌ను గోవా ఎన్నికల ఇన్‌ చార్జిగా నియమించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ దర్శన జర్దోష్‌ కో ఇన్‌చార్జిలుగా నియామకమయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు మణిపూర్‌ బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అసోం మంత్రి అశోక్ సింఘాల్‌కు కో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నది. దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాషాయ పార్టీ వ్యూహంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement