Sunday, May 5, 2024

26 జగనన్న టౌన్‌షిప్‌లు.. రెండో దశ అమ్మకానికి కసరత్తు

అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి టౌన్‌షిప్‌లో ప్లాట్లకు గిరాకీ పెరిగింది. ఇప్పటి వరకు మంగళగిరికే పరిమితమైన టౌన్‌షిప్‌లు త్వరలో సీఆర్‌డీఏ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతోంది.. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించిన వివరాలు, టౌన్‌షిప్‌ల ప్రతిపాదనలు చేయాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారు. కాగా తాడేపల్లి- మంగళగిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నవులూరు వద్ద మధ్యతరగతి వర్గాల కోసం అమరావతి టౌన్‌షిప్‌లో ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లను సీఆర్‌డీఏ అమ్మకానికి నిలిపింది. తొలివిడత 119 మంది ఎంపికైన వారికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

తొలివిడత ఎంఐజీ లేఅవుట్లలో 147 మంది దరఖాస్తు చేసుకోగా 102 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో రాండమ్‌ లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తూ ధృవీకరణ పత్రాలు జారీ చేశామని తెలిపారు. తాజాగా మరో 17 మంది కి సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో డాాక్యుమెంట్లను అందజేశా మన్నారు. ఇదే టౌన్‌షిప్‌లో మొత్తం 386 ప్లాట్లతో లేఅవుట్‌ వేశారు. తొలివిడత 119 పోగా మిగిలిన 267 ప్లాట్లకు త్వరలో దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు కమిషనర్‌ వివరించారు. ఈ లాటరీ ద్వారా ధృవీకరణ పత్రాలు పొందిన వారు నెల రోజులలోపు అగ్రిమెంట్‌ చేయించుకోవాలి. అగ్రిమెంట్‌ పూర్తయిన నెలలో పు 30 శాతం వాయిదాను చెల్లించాల్సి ఉంది.

ఆరు నెలలలోపు 30 శాతం నగదును ఏడాదిలోగా మరో 30 శాతం వాయిదాను నగదు రూపంలో చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. మొదటి నెల్లోనే మొత్తం సొమ్ము చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇవ్వడంతో పాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యత కల్పిస్తామని కమిషనర్‌ తెలిపారు. సీఆర్‌డీఏ ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో చక్కటి ప్రయోజనాలు కల్పిస్తాన్నారు. ఈ టౌన్‌షిప్‌లో ఎంఐజీ లేఅవుట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 11న ప్రారంభించారు. ప్రభుత్వం ద్వారా ఆమో దించిన ఈ లేఅవుట్‌కు ఏపీ రేరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) రిజి స్ట్రేషన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వివేక్‌ యాదవ్‌ చెప్పారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఆర్‌డీఏ ప్రత్యేక ప్రణాళిక రూపొందిం చిందని తెలిపారు.

లేఅవుట్ల పరిధిలో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్ల తో పాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాు ఫుట్‌పాత్‌, ఎస్టీపీ, వర్షపునీటి డ్రెయినేజి వ్యవస్థ, ఆహ్లాదాన్నిఅందించేందు కు అందమైన ఉద్యానవనాలు, పచ్చదనం, వీధి దీపాలు ఇతర సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. భవిష్యత్తులో సీఆర్‌డీఏ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతోంది. ఇప్పటి వరకు ఆరు ని యోజకవర్గాల పరిధిలో సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారని వాటిని రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదించామని కమిషనర్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement