Saturday, May 4, 2024

2016 Case – రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా అరెస్ట్….

కర్నూలు బ్యూరో – రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు, ఉద్యమ నేత బొజ్జా దశరథ రామిరెడ్డిని మంగళవారం నంద్యాలలో పోలీసులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు నంద్యాలలోని కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఆత్మకూరు పోలీస్ స్టేషను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనను స్థానిక కోర్టులో హాజరపరిచారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.

2016లో బొజ్జ దశరథ రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో కృష్ణ పై తీగల వంతెన వద్దు…సిద్దేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని ఆందోళన నిర్వహించారు. భారీగా పోలీసులు మోహరించిన రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ప్రజా ప్రతినిధులు కొత్తపల్లి మండలం సంగారమేశ్వర సంగమేశ్వరం వద్ద నిరసన చేపట్టారు. సిద్దేశ్వరం ప్రాజెక్టుకు పునాదులు వేసినట్టుగా రాళ్లు పాతారు. అప్పట్లో వీటికి సంబంధించి నాన్ బేలబుల్ కేసు పోలీసులు నమోదు చేసారు. . ప్రస్తుతం ఆయన అదే కేసులో పోలీసులు అదుపులోకి తీసుకొని ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు ఇంతవరకు నోరు విప్పలేదు. కారణాలు చెప్పడం లేదు. దశరథ రామ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం వెల్లడించారు. ఆయనను కోర్టులో హాజరు పరిచిన తర్వాత.. కోర్టు డైరెక్షన్ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆత్మకూరు సిఐ వెల్లడించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement