Sunday, April 28, 2024

17A Judgement – నేటి సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

న్యూ ఢిల్లీ – స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-A కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేశారంటూ పిటిషన్‌లో తెలిపారు.

తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని పిటిషన్‌లో తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aని ఉదహరిస్తూ తన అరెస్టును సవాల్ చేశారు. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది. దీంతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. కాగా ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement