Sunday, April 28, 2024

Delhi | ఢిల్లీని క‌మ్మేసిన పొగ‌మంచు.. విమాన స‌ర్వీసుల‌కు అంత‌రాయం

దేశ రాజ‌ధాని ఢిల్లీని ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్మేసింది. చ‌ల్ల‌ని గాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. పొగ‌మంచు కార‌ణంగా విజిబిలిటీ త‌క్కువ‌గా ఉంది. ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. విమాన స‌ర్వీసుల‌కు కూడా అంత‌రాయం క‌లిగింది. ఢిల్లీ విమానాశ్ర‌యంలో ప‌లు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆల‌స్యంగా బ‌య‌ల్దేర‌నున్నాయి. 17 విమానాలు ర‌ద్దు అయిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

విమాన స‌ర్వీసుల ఆల‌స్యం, ర‌ద్దు వ‌ల్ల ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌యాణికుల ర‌ద్దీ అధికంగా ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. అంతేకాకుండా, ఉత్తర భారతదేశం అంతటా తీవ్ర‌మైన చ‌లి ఉంటుంద‌ని తెలిపింది. ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్‌లో 3.3 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement