Thursday, December 8, 2022

చీమలు.. బంగారం స్మగ్లర్లు!

చీమల దండు స్మగ్లర్లగా మారాయి. బంగారాన్ని దూసుకెళ్లాయి. సాధారణంగా ఆహారాన్ని చీమలు ఎంతో భద్రంగా తీసుకెళుతుంటాయి. కానీ కిందపడిన ఓ బంగారు గొలుసును చీమల దండు ఎంచక్కా లాక్కెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. చత్తీస్ గఢ్ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతి చిన్న బంగారం స్మగ్లర్లు అంటూ ఆయన చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు పలు రకాలుగా పన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement