Sunday, February 5, 2023

పార్కింగ్‌ స్థలం లేకపోయినా పర్మిషన్..

కవాడిగూడ : ప్రభుత్వ అధికారులు తలచుకుంటే ఏదైనా చేయగలరు…… తిమ్మిని బమ్మి…. బమ్మిని తిమ్మి చేయడంలో వీరికి సాటి ఎవరూలేరు…..అందులో ఎక్సైజ్‌, పోలీస్‌శాఖలు నంబర్‌ వన్‌ స్థానం సంపాదిం చుకున్నాయి….. పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చిన వారిపట్ల…. నెలనెల మామూళ్లు ముట్టజెప్పిన వారిపట్ల ఎక్సైజ్‌, లా ఆండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు విశ్వాసం ఎక్కువగా చూసిస్తారనడంలో ఏలాంటి సందేహాం లేదు. ముడుపులు చెల్లించిన వారిపై ఎనలేని ప్రేమ, మద్దతు, సహాకారం చూపిస్తారు. అకస్మిక త నిఖీలు, అధికారుల విజిటింగ్‌ వివరాలను ముందుగానే చేరవేసి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా విశ్వాసాన్ని చాటుకుంటారు. వివరాల్లోకి వెళితే…. ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌, చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముషీరాబాద్‌ నుంచి పద్మరావునగర్‌ వెళ్లే ప్రదానరోడ్డులో కెవికె వైన్‌షాపు నిర్వాహణకు అనుమతిస్తూ 2 సంవత్సరాలకు లైసెన్స్‌ జారీ చేశారు. ఈ వైన్‌షాపు ఏర్పాటు చేసిన భవనానికి పార్కింగ్‌స్థలంలేదు. అయినప్పటికి ఎక్సైజ్‌శాఖ అధికారులు లైసెన్స్‌మంజూరు చేశారు. పార్కింగ్‌ స్థలం లేకుండా వైన్‌షాపుకు ఎలా లైసెన్స్‌ జారీ చేస్తారని పలువురు స్థానికులు ఎక్సైజ్‌శాఖ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వైన్‌షాపు కొనసాగుతుందని, నిత్యం వందల సంఖ్యలో వాహానాలు రోడ్డుపై అక్రమంగా, అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేయడం వల్ల వాహానదారులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. అటు లా ఆండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు మామూళ్లు తీసుకోని కనీసం ఇటువైపు కన్నెత్తికూడా చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాకపోకలు సాగించే వాహానదారులు, స్థానిక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నిఇన్ని కావు. ట్రాఫిక్‌ పోలీసులు, లా ఆండ్‌ ఆర్డర్‌ పోలీసులు తక్షణమే స్పందించి వాహానాలు రోడ్డుపై నిలపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు, వాహానదారులు, పాదచారులు కోరుతున్నారు. ఆదే విధంగా పార్కింగ్‌ స్థలం లేకుండా అనుమతించిన వైన్‌షాపు లైసెన్స్‌ రద్దు చేయాలని బస్తీ వాసులు డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement