Friday, May 17, 2024

ఇద్ద‌రు ప‌రువు న‌ష్టం పొందేందుకు అర్హులే – హాలీవుడ్ న‌టుడు జానీడెప్ కేసులో కోర్టు తీర్పు

వారిద్ద‌రు హాలీవుడ్ న‌టులు..మాజీ దంప‌తులు కూడా జానీ డెప్‌క, ఆయన మాజీ భార్య అంబర్‌ హార్డ్ . కాగా ఒక‌రిపై ఒక‌రు పరువు నష్టం దావా వేసుకోగా ఈ కేసులో ఇద్దరు పరువు నష్టం పొందేందుకు అర్హులే అంటూ వెల్లడించింది.. వర్జీనీయాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ కోర్ట్. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో కోర్ట్ ఆవరణ మొత్తం షాక్‌కి గురయ్యింది. జానీ డెప్‌ పేరును ప్రస్తావించకుండానే మ్యారేజ్‌ లైఫ్‌లోని హింస గురించి ప్రస్తావిస్తూ 2018లో ఆయన మాజీ భార్య అంబర్‌ హార్డ్ ది వాషింగ్టన్‌ పోస్టులో ఒక కథనం రాసింది. ఆ కథనం తనని ఉద్దేశించిందే అని, తన పరువు దెబ్బతీసేలా ఆ కథనం ఉందని ఆరోపిస్తూ జానీ డెప్‌ 2019 ఫిబ్రవరిలో 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు జానీ డెప్. అంతేకాదు ఆమె తనకు నరకం చూపించేదని, అవమానించేదని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో(ఎలన్‌ మస్క్‌)తో ఎఫైర్‌ నడిపించిందని, అదే ఆమెను ప్రభావితం చేసిందని దావాలో ఆరోపించారు. దీంతో ఆయన మాజీ భార అంబర్‌ హార్డ్ కూడా తిరిగి పరువు నష్టం దావా వేసింది. తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్‌, ఆయన లాయర్‌ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 2020 ఆగష్టులో 100 మిలియన్‌ డాలర్లకు కౌంటర్‌ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం(జూన్‌ 1) తీర్పు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పుని వెల్లడించింది. ఆయనకు మాజీ భార్య 15 మిలియన్‌ డాలర్లు పరువు నష్టం చెల్లించాలని వెల్లడించింది. అదే సమయంలో అంబర్‌ హర్డ్ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్‌ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్‌కు ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్‌ కోర్టు.2018లో ఆమె రాసిన సెక్సువల్‌ వయొలెన్స్‌ ఆర్టికల్‌ ఒకటి, జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది.
కోర్టు తీర్పు అనంతరం జానీ డెప్‌ మాజీ భార్య అంబర్‌ బోరున విలపించింది. తన గుండె బద్ధలైందని, నిరాశ చెందానని, ఈ తీర్పు తనకే కాదని మహిళలందరికీ దెబ్బ అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తనకున్న పరిపతి కారణంగానే జానీ డెప్‌ ఈ కేసులో గెలిచాడని ఆరోపించింది. మరోవైపు కోర్పుతో జానీ డెప్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ(న్యాయమూర్తులు) సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement