Sunday, May 19, 2024

Twit – ప‌విత్ర నేల‌పై విషం చిమ్మ‌కండి … మోదీకి కెటిఆర్ హితవు ..

ప‌దేళ్ల‌లో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి
దేశంకోసం మీకున్న విజ‌న్​ను ప్ర‌జ‌ల ముందుంచండి
ప‌దేళ్ల‌లో తెలంగాణ‌కు ఇవ్వ‌వ‌ల‌సిన‌వి ఎందుకివ్వ‌లేదు
ఒక్క నీటి ప్రాజెక్టైనా జాతీయ హోదా ఇచ్చారా
కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీని గుజ‌రాత్​కు ఎత్తుకెళ్లింది మీరేగా
బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీకి పాత‌రేసింది కూడా మీరే
ప్ర‌ధాని మోదీ రాక సంద‌ర్భంగా ప్రశ్నల వర్షం
ట్విట్టర్​లో నిలదీసిన బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​

ఈ దేశం కోసం ఏదైనా విజ‌న్ ఉంటే చెప్పండి.. కానీ, ద‌య‌చేసి స‌మాజంలో విభ‌జ‌న మాత్రం సృష్టించ‌కండి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్ర‌ధాని మోదీకి సూచించారు. రాష్ట్రానికి మంగళవారం ప్ర‌ధాని వ‌స్తున్న నేప‌థ్యంలో యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ట్విట్ట‌ర్ వేదిక‌గా కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ప్ర‌ధానిగా తెలంగాణ ప్ర‌ధాన హామీల‌ను ఎందుకు మ‌రిచారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ద‌య‌చేసి ప‌విత్ర‌మైన ఈ నేల‌పై విషం చిమ్మ‌కుండా, ద‌శాబ్దాకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడ‌గాల‌ని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి అని సూచించారు. రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు.. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement