Thursday, May 2, 2024

తిరుప్పావు సారము

సంసార దు:ఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయుణుడు అమ్మవారికి (లక్ష్మి) జీవులు ముక్తిని పొందు సులభోపాయము లను మూడింటిని ఉపదేశించెను అవి శ్రీహరి నామసంకీర్త నము, శరణాగతి, పుష్పా ర్చన.
ఈ మార్గములను బోధించి జీవులను తరింప చేయ దలచిన అమ్మవారు శ్రీ విష్ణుచిత్తులకు తులసీ వనమున లభించినది. శ్రీవిష్ణుచిత్తులు ఈమెకు గోదా అని నామక రణం చేసిరి.

యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీవటపత్ర శాయిని భర్తగా పొందదలచి, అట్లు పొందుటకు పూర్వము గోపికలు వ్రతమును ఆచరిం చిరని విని తానావ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాశురముల రూపంలో వ్రత మును రచించెను. దాని పేరే ‘తిరుప్పావై’.
ఈ తిరుప్పావు మూడు భాగములుగా పేర్కొనెదరు.
మొదటి 5 పాశురములు ఉపోద్ఘాతము.
తరువాతి పాశురములలో నందగోపుని భవన పాలకుని, ద్వారపాలకుని, మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోద ను, శ్రీకృష్ణభగవానుని, బలరాముని మేల్కొలుపుట, తరు వాత నీలాదేవిని మేల్కొలుపుట, తరువాత శ్రీకృష్ణుని నీలా దేవిని ఇరువురిని మేల్కొలుపుట, శ్రీకృష్ణ భగవానుని సభా స్థలిలో వేంచేసి సింహాసనాసీనుని కమ్మని ప్రార్థించుట.
స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయు ట, తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వ కాల సర్వావస్థల యందు కైంకర్య మును చేయు భాగ్యమును ప్రసాదించ మని ప్రార్థించుట-
ఇది తిరుప్పావై సారము.

తిరుప్పావై
పాశురము – 1

మార్గళిత్తింగల్‌ మది నిఱౖన్ద నన్నాళాల్‌
నీరాడ ప్పోదువీర్‌ పోదుమినో నేరిళైయీర్‌!
శీర్‌ మల్‌గు మాయ్‌ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్‌ కాళ్‌!
కూర్‌ వేల్‌ – కొడున్దొళిలన్‌ నన్దగోపన్‌ కుమరన్‌
ఏరాన్‌ న్దకణ్ణి యశోదై యిళ ఞ్జిఙ్గమ్‌
కార్‌మేని చ్చెంగణ్‌ కదిర్‌ మది యమ్మోల్‌ ముగత్తాన్‌
నారాయణనే నమక్కే పఱౖ దరువాన్‌
పారోర్‌ వుగళప్పడిన్దేలో రెమ్బావాయ్‌!

తాత్పర్యము: ‘శుభప్రదమైన మార్గశీర్ష మాసము శుక్లపక్షమున వెన్నెల నిండిన రాత్రులు గలది. స్నానము చేయు తలంపు కల వారందరూ రండు. చక్కని ఆభరణములు ధఱించి, సకల సంపదలు నిండిన గోప కులమున నున్న స ంపదలు కల గోపికలారా! వేలాయుధమున ధరించిన నందుని కుమారుడు, విశాలనేత్ర ములు కల యశోద బాలసింహము నీలమేఘ శ్యాముడు అరుణ నేత్రుడు, సూర్యచంద్ర సన్నిభముఖుడగు శ్రీమన్నారాయణుడే మన వ్రత సాధనమును అనుగ్రహించును. లోకములన్నియు ఆనందించును.’
ఇచట స్నానం అంటే శ్రీకృష్ణ సమాగమము. ఆ కోరిక కలవారందరూ ఇందుకు అర్హులు. భగవంతుని సేవకు సంకల్పించగానే మంచి కాలము, వాతావరణము తమకుతామే సమకూరును అని తెలిపిరి. భగవంతుని సేవ చేయ సంకల్పించుటే ఐశ్వర్యము. భగవంతుడు ఆచార్యునకు విధేయునిగా ఉండును. మంత్రమున యధేచ్చగా విహరించును. ‘మంత్రోమాతా గురు:పితా’ అని ప్రమాణము. యశోద అనగా కీర్తి నిచ్చునది. తల్లి అనగా మంత్రము. నంద గోపుడనగా ఆనందమును కాపాడువాడు. ఇచట ఆనందమనగా పరమాత్మ. అతనిని అయోగ్యులకు అందకుండా కాపాడువాడు ఆచార్యుడు. వ్రతమునకు కూడా పరమాత్మ తగిన సాధన సంపత్తిని కూర్చి కొనసాగించును అని బోధించినది.

- Advertisement -

– డాక్టర్‌ కందాడై
రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement