Saturday, May 18, 2024

దూసుకుపోతున్న వెస్టిండీస్‌, చెరో హాఫ్‌ సెంచరీ చేసిన షాయ్‌ హోప్‌, షమర్‌ బ్రూక్స్‌

ముల్తాన్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ తన ప్రత్యర్థి పాకిస్తాన్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కైల్‌ మైర్స్‌ వికెట్‌ ఆరంభంలోనే పడిపోయినప్పటికీ…షాయ్‌ హోప్‌, షమర్‌ బ్రూక్స్‌ మ్యాచ్‌పై పట్టు సాధించారు. చెరో హాఫ్‌ సెంచరీ చేశారు. షహీన్‌ అఫ్రిది ఆరంభంలో మెరుపులు మెరిపించినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. కైల్‌ మైర్స్‌ను క్రీజ్‌నుంచి విజయవంతంగా తప్పించడంలో కృతకృత్యుడయ్యాడు.

టాస్‌ గెలుచుకున్న వెస్ట్‌ ఇండీస్‌ బ్యాటింగును ఎంచుకుంది. పాకిస్థాన్‌ తరఫున 21 ఏళ్ల వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మెన్‌ మహ్మద్‌ హారిస్‌ తొలిసారిగా ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లో అడుగుపెట్టాడు. గాయం కారణంగా స్పిన్నింగ్‌ మాంత్రికులు షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో పాల్గొనలేకపోయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. వన్‌ డే సూపర్‌ లీగ్‌లో భాగంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరగనున్నాయి. మరో రెండు మ్యాచ్‌లు శుక్రవారం, ఆదివారం జరుగుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement