Sunday, May 19, 2024

శారంగధర సంహిత

ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేసిన ప్రాచీన మహర్షులు ప్రకృతిలో లభించే అనేక మూలికలు, పార్థివ, జాంత ద్రవ్యాలతో వివిధ వ్యాధుల చికిత్సలందు ఉపయుక్తమయ్యే ఔషధాలను రూపొందించి, రోగి శరీరంపై వాటి ప్రభావాన్ని పరిశీలించి సదరు ఫలితాల్ని సంహతల రూపంలో గ్రంథస్థం చేశారు. అటువంటి వాటిలో బృహత్త్రయంగా పిలువబడే చరక సంహత, సుశ్రుత సంహత, అష్టాంగ హృదయం, లఘుత్రయంగా పిలువబడే మాధవ నిదానం, శారంగధర సంహత, భావ పకాశ సంహత అనునవి ఆయుర్వేద వైద్య శాస్త్ర అధ్యయనంలో పాఠ్య గ్రంథాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
శ్లో|| హత్వాది రూపాకృతి సాత్మ్యజాతి
భేదైస్సమీక్ష్యాతుర సర్వరోగా|
చికిత్సితం కర్షణ బృంహణాఖ్యం కుర్వీతవైద్యో
విధివత్సు యోగై:||

అంటే ”హతువు, పూర్వరూపం, ఆకృతి, సాత్మ్య ము, జాతి వీనిచే రోగ స్వరూపంబును చక్కగా తెలిసికొని దోషావస్థా భేదంబుచే కర్షణ, బృంహణ చికిత్సను చేయ వలెను” అని.
ఇందులో 1.’హతువు’ అనగా రోగము పుట్టుటకు ముఖ్యకారణము. 2. ‘పూర్వరూపము’ అనగా రోగము జనించుటకు పూర్వము పుట్టు వెలవెలబాటు, ఒడలు విఱుపు, ఆవులింతలు, నేత్ర స్రావము మొదలగునవి. 3. ‘ఆకృతి’ అనగా రోగము పుట్టిన పిమ్మట ఆయా రోగ మున పుట్టు లక్షణములు. 4. ‘సాత్మ్యము’ అనగా రోగ జ్ఞానము సంపూర్ణముగా తెలియనప్పుడు ఆయా దోష నివృత్తికి సాధనములగు ఆహారాచార ప్రయోగము. 5. ‘జాతి’ యన ప్రకుపితమగు దోషమునకు ఊర్ధ్వ గతియు, అధోగతియు, తిర్యగ్గతియు, వీనిచే గలిగెడి రోగములకు చికిత్స భేదమును తెలియజేయు ఉపాయము. అది సంప్రాప్తియని వ్యవహరింపబడును. అది సంఖ్యాది భేదముల నానావిధాలై ఉండును. ఆయా భేదముల తంత్రాంతరమున జూడదగును. 6. ‘కర్షణ చికిత్స’ అనగా తీక్షణములగు ఓషధులచే శరీరమును కృశింప జేయుట, ఇది ‘అపతర్పణ’ మనబడును. 7. ‘బృంహణ చికిత్స’ యనగా స్నిగ్ధములగు పదార్ధము లచే కృశించిన శరీరమునకు పుష్టిని గలి గించుట. ఇది ‘సంతర్పణ’ మనబడును. అని శారంగధర సంహత చెబుతోంది.
ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేసిన ప్రాచీన మహర్షులు ప్రకృతిలో లభించే అనేక మూలిక లు, పార్థివ మరియు జాంత ద్రవ్యాలతో వివిధ వ్యాధుల చికిత్సలందు ఉపయుక్తమయ్యే ఔషధాలను రూపొం దించి, రోగి శరీరంపై వాటి ప్రభావాన్ని పరిశీలించి సద రు ఫలితాల్ని సంహతల రూపంలో గ్రంథస్థం చేశారు. అటువంటి వాటిలో బృహత్త్రయంగా పిలువబడే చరక సంహత, సుశ్రుత సంహత, అష్టాంగ హృదయం అనునవి. లఘుత్రయంగా పిలువబడే మాధవ నిదానం, శారంగధర సంహత, భావ పకాశ సంహత అనునవి ఆయుర్వేద వైద్య శాస్త్ర అధ్యయనంలో పాఠ్య గ్రంథా లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ప్రాచీనమైన అన్ని గ్రంథాల్లోకి శారంగధర సంహ త ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొంది. మందు లను తయారుచేసుకునే సులభమైన విధానాలని వివరి స్తూ సత్పలితాన్నిచ్చే అనేక మూలికా ఉపయోగాలు, రసౌషధాలను శారంగధరుడు పొందుపరిచాడు. గ్రంథ స్థ విషయాన్ని 32 అధ్యాయాల్లో వివరించాడు. అధ్యా యం చివర్లోఉదహరించిన శ్లోకాన్నిబట్టి శారంగధరు డు దామోదరసూను పుత్రుడని తెలుస్తోంది. వోపదేవు డు (13- 14వ శతాబ్దం) ఈ సంహతపై టీక వ్రాశాడు. ఇది ప్రస్తుతం లభ్యం కావడంలేదు. హమాద్రి (13-14వ శతాబ్దం) తన వ్యాఖ్యలో శారంగధరుని ఉదహరించా డు. మధ్య భారతదేశ కాలంలో ప్రచలితంగా వుండే అహఫేనం వంటి ఔషధాలు, రసౌషధాలు, నాడీ విజ్ఞానం వంటి ప్రక్రియలు ఇందులో ఉదాహ రించబడ్డాయి.
ఆచార్య శారంగధర ఆయు ర్వేద వైద్యంపై ‘శారంగధర సం హత’ పేరుతో ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. ఆయన ‘నీతిశాస్త్రం’ పై ‘శారంగధర పద్ధతి’ అనే గ్రంథా న్ని కూడా రచించారు.
అతను దామోదర పెద్దకు మారుడు, రాఘవ దేవ మనవడు. 13వ శతాబ్దం ఎడిలో శాకంబరి దేశా న్ని పరిపాలించిన హమ్మీర్రాజు ఆస్థానంలో శారం గధర తాత అయిన రాఘవదేవ్‌ గొప్పకవి. రాఘవ దేవ్‌ ‘మహాగణపతిస్తోత్ర’ రచయితకూడా. నేటికీ, ‘శాకంబరీ దేవి ఆలయం’ కురుక్షేత్ర సమీపంలో హర్యానా రాష్ట్రం లోని అంబాలా మండ లంలో ఉంది, సంక్షిప్తంగా రాఘవదేవ్‌కు 3 కుమారులు, గోపాల్‌, దామోదర్‌, దేవదాస్‌ ఉన్నారు. దామోదర్‌కు శారంగ ధర (పెద్ద కుమారుడు), లక్ష్మీధర్‌, కృష్ణ అనే ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు.
ఆయుర్వేద అభ్యాసానికి సహాయపడే చిన్న గ్రంథా లను వ్రాయవలసిన అవసరం ఉందని వారు భావించా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, చాలామంది రచయితలు 10వ శతాబ్దం నుండి చిన్నగ్రంథాలను రూపొందించ డానికి ప్రయత్నించారు, తద్వారా లఘు త్రయీలు ఉద్భవించాయి. శారంగధర కూడా అదే సూత్రాన్ని అవ లంబించాడు. వైద్యంపై తన రచనను వ్రాశాడు, అది తరువాత ‘శారంగధర సంహత’గా ప్రాచుర్యం పొందిం ది. శారంగధర మంచి వైద్యుడు, రచయిత మాత్రమే కాదు, అతను మంచి కవి కూడా.

శారంగధర సంహత ప్రత్యేకత

1.రాశి (మేష- వృషభం మొ.) ఆధారంగా ఋతువు లేర్పడడం.

  1. శ్వసన ప్రక్రియ విశదీకరణలో ఆక్సిజన్ను విష్ణుపదా మృతంగా పేర్కొనడం.
  2. ధాతువుల శోధన మారణలు, రకరకాల రసౌషధాలు.
  3. శిరస్సుపై కత్తితో గీచి సూచికాభరణ రసౌషధినిరుద్ధి నేరుగా ఔషధాన్ని రక్తంలో ప్రవేశపెట్టే విధానం.
    మొదలగు ఎన్నో విషయాలను శారంగధరుడు చక్ర దత్త, గద నిగ్రహమను గ్రంథాలను అనుసరించి విష యం వర్ణన చేశాడు. చికిత్సచేసే వైద్యులకు ఈ గ్రంథం అత్యంత ఉపయోగకరరిగా ఉంటుంది. శారంగధర సంహతలోసుమారు 316 మూలికలు, 50 రసౌషధాల తో వివిధ చికిత్సలు వర్ణింపబడ్డాయి.
    పూర్వ ఖండ- సంహతలోని 1వ విభాగం 7 అధ్యా యాలను కలిగిఉంటుంది. ఇది ఔషధ సూత్రీకరణల రకాలు, పల్స్‌ పరీక్ష, ఆహారపదార్థాలను ప్రాసెస్‌ చేయ డం, వ్యాధుల సంఖ్యాశాస్త్రం, సాంకేతిక పరిభాష, అనా టమీ, ఫిజియాలజీ మొదలైనవాటితో వ్యవహరిస్తుంది.
    మధ్యమ ఖండ- సంహత 2వ విభాగం 12 అధ్యాయా లను కలిగి ఉంటుంది.
    ఉత్తరఖండ- సంహితలోని 3వ విభాగం 13 అధ్యాయా లను కలిగిఉంటుంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement