Saturday, May 4, 2024

ఇంటర్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేయాలి:ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ పరీక్షలకు నిమిషం నిబంధనను ఎత్తివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ఈనెల 6 నుండి జరగబోతున్న ఇంటర్‌ పరీక్షలకు నిమిషం నిభందనను తొలగించాలని ఈమేరకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణ సౌకర్యం సరిగా లేని గ్రామాల నుంచి పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారని, ఇలాంటి వారంతా కచ్చితమైన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునే అవకాశం లేదని తెలిపారు. ఈనేపథ్యంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమనే ఇంటర్‌ బోర్డు ప్రకటించిన నిమిషం నిబంధనను ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement