Monday, May 6, 2024

సేవకు ప్రతి రూపం వాలంటీర్లు – ఉప స‌భాప‌తి కోన‌

బాపట్ల – రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైనదని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. అంతర్జాతీయ పంచాయితీ దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన సేవరత్న,సేవ వజ్ర పురస్కార వజ్రోత్సవ సభ లో ఆయన ప్రసంగించారు. వాలంటీర్ల వ్యవస్ద కేరళ రాష్టంలో నడుస్తోందని.అదే విధంగా మన రాష్టంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే వ్యవస్ద ను ఏర్పటు చేసి ప్రతి ఒక్క పథకం అర్హులైన పేదల నివాసాలకు వెళ్లి అందించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. కష్టపడి పని చేస్తున్న వాలంటీర్ల కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందిస్తుందన్నారు. ప్రజలకు సేవ చేయని వాలంటీర్ల ను త్వరలోనే తొలిగిస్తామన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పింఛన్,ఇతర సేవలు అందలన్న సంవత్సరల కాలం బట్టెదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం లో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు 15 రోజులలో అందుతున్నాయన్నారు. ప్రజలకు వాలంటీర్ల ద్వారా పథకాలను అర్హులైన వారందరి నివాసాలకు వెళ్లి అందిస్తున్నారన్నారు.తాను బాపట్ల ను ఎంత అభివృద్ధి చేయాలని నిధులు తీసుకువచ్చిన అధికారులు పని చేయక పోతే తాను పడ్డ కష్టానికి ఫలితం ఉండదన్నారు.అయితే నియోజకవర్గ పరిధిలో అన్ని శాఖల అధికారులు ఎంతో కష్టపడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ పరిధిలో 5గురుకి సేవ వజ్ర, 30 మందికి సేవ రత్న లు అందజేశారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్,ఎంపిడిఓలు రాధ కృష్ణ,ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement