Saturday, May 4, 2024

సిటీ జనాలకు హ్యాపీ జర్నీ.. డబుల్‌ డెక్కర్‌ బస్సులు వచ్చేస్తున్నయ్​..

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌ : హైదరాబాద్‌ మహానగరంలో 2005 వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు చక్కర్లు కొట్టేవి. ఆ తర్వాత వాటిని నిర్వహించలేక ఆర్టీసీ చెతేలె త్తెసింది. గత ఏడా దిన్నర క్రితం ఒక నెటిజన్‌ ద్వార డబుల్‌ డెక్కర్‌ బస్సులు నిర్వహిస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ రావడంతో తిరిగి ఈ ఆలోచన తెరపైకి వచ్చింది. వెంటనే మంత్రి కేటీఆర్‌ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో చర్చించి డబుల్‌డెక్కర్‌ బస్సులను పున: ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి అనుకుంటున్న ఆలోచన డిసెంబర్‌ నాటికి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఎలక్ట్రిక్‌ ఏసీ డబుల్‌ డెక్కర్‌ బస్సుల నిర్వాహణ వల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, వాహనాల వల్ల వచ్చే వాయుకాలు ష్యాన్ని తగ్గించవచ్చని మంత్రి కేటీఆర్‌ హెచ్‌ఎండీఏ అధికారులతో చర్చించి ఆ దిశగా అడుగులు వేయించారు. మంత్రి ఆదేశాలతో హెచ్‌ఎండీఏ ముందుగా ఆరు ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులను తీసుకుని ఆర్టీసీకి అద్దె ప్రతిపాదికన ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సుల కోసం టెండర్‌ పిలిచారు. ఈనెల 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, 14 వ తేదీన ఫ్రీ బిడ్‌ సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ ఆరు బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం ద్వారా వాటిని పటాన్‌చెరువు- కోఠి, సీబీఎస్‌-జీడిమెట్ల, అఫ్జల్‌గంజ్‌- మెహిదీపట్టణం మార్గాల్లో తిప్పాలని, వీటికి ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి తదుపరి మరిన్ని బస్సులను తీసుకోవాలని నిర్ణయించారు.

పర్యావరణ హితమే లక్ష్యంగా ..

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంపై హెచ్‌ఎండీ ఏ దృష్టి సారించింది. ఇప్పటికే నగరంలో పార్క్‌లతో పాటు హైదరాబాద్‌ చుట్టు ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరు వైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తుంది. అర్భన్‌ పార్కలపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ చేపడుతున్న గ్రీనరీతో గ్రీన్‌సిటీ ఆవార్డును దక్కించుకోవడం జరిగింది. వాయుకాలుష్యాన్ని కట్టడి చర్యల్లో భాగంగా ఎలక్ట్రికల్‌ బస్సులు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.

- Advertisement -

ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతిరోజు 60 నుంచి 70 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటి ద్వారా వెలువడుతున్న వాయు కాలుష్యంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కాలుష్య నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మరో ఢిల్లి అవుతుందని, ముందస్తు జాగ్రత్తలు అవసరమని బావిస్తున్నారు. వాహనాల వల్ల వెలువడుతున్న వాయుకాలుష్య నియంత్రణకోసం ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులను హెచ్‌ఎండీఏ ఆలోచిస్తుండగా, ఆర్టీసీ కూడా నగరంలో 300 ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలుఇస్తే భవిష్యత్‌లో ఎలక్ట్రికల్‌ బస్సులకే ప్రాధాన్యత నివ్వాలని భావిస్తున్నారు. హెచ్‌ఎండీఏ చేపడుతున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందని అధికారులు బావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement