Tuesday, May 21, 2024

మిర్చి రైతుల ఇబ్బందులను పట్టించుకోండి కేసీఆర్ సారు: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. మిర్చి రైతులను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘’దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు.. కరోనా  వచ్చిన ఏడాదికైనా కేసీఆర్ సారు .. మేల్కొని ఆదిలాబాద్, వరంగల్‌లలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ తక్షణమే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషం. కానీ రాష్ట్రంలో మిర్చి రైతుల ఇబ్బందులను కూడా కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని మిర్చి మార్కెట్లు బంద్ చేసి 25 రోజులు దాటిపోతుంది. మార్కెట్‌లలో పంటను అమ్ముకోలేక, రైతులు తమ ఆర్థిక అవసరాల కోసం అడ్డికి పావుశేరుకు పంటలను దళారులకు అమ్ముకొంటున్నారు. క్వింటాళ్‌కు 4 నుంచి 5 వేలు నష్టపోయే పరిస్థితి. మిర్చి రైతులు మరింత నష్టపోకముందే.. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకముందే.. మిర్చి మార్కెట్లను తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. ప్రాణనష్టం నివారించండి’’ అని షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement