Tuesday, December 3, 2024

Shirisha : బ‌ర్రెల‌క్క ప్ర‌చారానికి ల‌క్ష‌రూపాల‌య విరాళం… యానం మాజీమంత్రి

తెలంగాణ బర్రెలక్క శిరీషకు మద్దతుగా యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బాస‌ట‌గా నిలిచారు. ఆమె ప్ర‌చారానికి లక్ష రూపాయలు విరాళంగా పంపించారు. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు తెలంగాణ బర్రెలక్క శిరీష పోటీ చేస్తున్నారు.

శిరీషతో ఫోన్లో మాట్లాడిన మల్లాడి కృష్ణారావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కొల్లాపూర్ నియోజక వర్గ ఓటరు మహాశయులారా పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క శిరీషకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి… రాజకీయాల్లో ప్రశ్నించే శిరీష లాంటివాళ్ళు ముందుకు వస్తే మీ భవిష్యత్తు మారుతుంది. మీ గెలుపు నేను కోరుకుంటున్నాను. నీ ప్రచార ఖర్చులకోసం లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నానని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement