Monday, April 29, 2024

Yadagirigutta – 24 గంట‌లు క‌రెంట్ కావాలో… మూడు గంట‌లు క‌రెంట్ కావాలో ఆలోచించండి …. కెటిఆర్

యాద‌గిరిగుట్ట – ‘‘55 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో సాధ్యం కానిది, బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించింది, రాబందుల
లెక్క రైతులను పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా.? మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా? 24 గంటల కరెంటిస్తున్న బీఆర్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ కావాలో, కరెంటు కావాలో తేల్చుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదు, ఉత్తిత్తి కరెంటు’’ అని తెలంగాణ రాష్ర్ట మంత్రి కే.తారక రామారావు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట‌లో సోమవారం కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. యాదగిరి గుట్టలో అశేష సంఖ్యలో కేటీఆర్కు బ్రహ్మరథం పట్టారు. నీరాజనం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో ఆలోచించుకుంటే తెలంగాణ వస్తే ఏం జరిగిందో అర్థమైతది. యాదగిరిగుట్ట ఆలయం గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసిండు. యాదగిరిగుట్ట అభివృద్ధితో కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమే

కొండపైకి ఆటోలు వెళ్లేలా ఆటో డ్రైవర్లకు డిసెంబర్ 3న తర్వాత శుభవార్త చెప్తాం, ఆటోల ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సమయంలో రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండేవాళ్లు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డికి సిగ్గు శరం లేదు. ఆలేరులో ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకోండి. 24 గంటల కరెంటు వస్తుందో లేదో తెలుస్తది. మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా 24 గంటల కరెంటిస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదు, ఉత్తిత్తి కరెంటు ఇచ్చింది, అని కేసీఆర్ విమర్శించారు. వరిధాన్యం పండించడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్ వన్ 55 ఏండ్లు అధికారంలోని కాంగ్రెస్ వాళ్లు ఏం పీకినరు. కాంగ్రెస్ కు ఒక్కఛాన్స్.? ఎందుకియ్యాలి, అని కేటీఆర్ ప్రశ్నించారు.

తాగు, సాగునీటి కష్టాలు పోయినయ్ గందమల్ల, బస్వాపూర్ తో సాగునీటి కష్టాలు పోయినయ్ కరోనాతో ప్రభుత్వానికి లక్ష కోట్ల నష్టం వచ్చింది , అయినా అభివృద్ధి ఆగలే. డిసెంబర్ 3 తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు వస్తయ్, నాలుగు కొత్త పథకాలు తీసుకు వస్తాం. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మీ, ఆసరా పింఛన్లను రూ.5 వేలు చేయబోతున్నం, వంటగ్యాస్ సిలిండర్ ను రూ.400 కే ఇస్తం. తెల్లరేషన్ కార్డులు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇవ్వబోతున్నం. భూమి లేనోళ్లకు కూడా రూ.5 లక్షల కేసీఆర్ భీమా ఇస్తం, రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నడు, కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ చేస్తామంటున్నరు. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తం, సమ్మక్క సారక్క పేర్లతో మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గొంగిడి సునీతను గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురాలను మండలాలుగా చేస్తం ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తం, డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతుంది. ఈ సభ గొంగిడి సునీత గెలుపు విజయోత్సవ సభగా తలపిస్తోంది అని కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్పాహం నింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement