Thursday, May 2, 2024

Nalgonda: అసమ్మతి నేతల నోళ్లకు తాళాలు పడేనా?

తిరుమలగిరి, ఆగస్టు 22, ప్రభ న్యూస్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ కోదాడ నాగార్జునసాగర్ దేవరకొండ మరికొన్ని నియోజకవర్గాల్లో గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో అసమతి వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని ప్రచారం చేసిన సంగతి విధితమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అసమతి నేతల నోళ్లకు తాళాలు పడినట్లే అయ్యేనా?

బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ హెచ్చరించడం, భవిష్యత్తులో అసమ్మతి వర్గీయులకు సముచితస్థానం కల్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సిట్టింగులు అసమ్మతి వాదులతో చర్చలు జరిపి సఖ్యత చేసుకోవాలని సూచించారు. లేనిచో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం త్రిసభ్య కమిటీ వేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement