Sunday, December 8, 2024

FIR Filed – చంద్ర‌యాన్ 3పై ప్ర‌కాశ్ రాజ్ పోస్ట్ … క‌ర్నాట‌క‌లో కేసు న‌మోదు

భ‌గ‌ల్‌కోట్‌: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌పై కామెంట్ చేసిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పై క‌ర్నాట‌క‌లో కేసు న‌మోదైంది. హిందూ సంఘాల నేత‌ల ఫిర్యాదుతో భ‌గ‌ల్‌కోట్ జిల్లాలోని బాన‌హ‌ట్టి పోలీసు స్టేష‌న్‌లో కేసు ఫైల్ చేశారు. . న‌టుడు ప్ర‌కాశ్‌పై చర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

చంద్ర‌యాన్‌-3కి చెందిన ల్యాండ‌ర్ విక్ర‌మ్ రేపు సాయంత్రం చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ వివాదాస్ప‌ద‌మైంది. ఓ కార్టూన్‌ను అత‌ను పోస్టు చేశాడు. లుంగి క‌ట్టుకున్న ఓ వ్య‌క్తి టీ పోస్తున్న‌ట్లు ఆ కార్టూన్‌లో ఉంది. చంద్రుడి నుంచి వ‌చ్చిన తొలి ఫోటో ఇదే అని ఆ పోస్టులో ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ఆన్‌లైన్‌లో విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని విమ‌ర్శించ‌డం స‌రికాదు అని నెటిజెన్లు అన్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం శాస్త్ర‌వేత్త‌ల‌ను అవ‌మానించ‌డం త‌గ‌దంటూ మేధావులు సైతం ప్ర‌కాష్ రాజ్ కి క్లాస్ పీకారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement