Saturday, May 4, 2024

ఆర్మీ అభ్యర్థి శ్రీకాంత్‌కు అండగా ఉంటాం.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర సందర్భంగా పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఆర్మీ అభ్యర్థి శ్రీకాంత్‌కు అండగా ఉంటామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ హామీ ఇచ్చారు. ఆర్మీ అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని, వారికి సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మంగళవారం శ్రీకాంత్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. జీతం ఇవ్వకపోయినా ఫర్వాలేదని సరిహద్దుల్లో సైనికునిగా పనిచేసి ప్రాణాలు ఇచ్చేందుకు యువత సిద్ధంగా ఉందని అన్నారు.

కాలులో బుల్లెట్‌ దిగినా దేశానికి సేవ చేసేందుకు శ్రీకాంత్‌ సిద్ధంగా ఉన్నాడని ఆయన తెలిపారు. శ్రీకాంత్‌ లాంటి అనేకమంది యువత భవిష్యత్‌ను కేంద్రం నాశనం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఫిజికల్‌ టెస్ట్‌ పాస్‌ అయిన ఆర్మీ అభ్యర్థులందరికీ రాతపరీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిఎస్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఐసీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ యువత మనోభావాలను ఆర్థం చేసుకుని కేంద్రం ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement